మనం ప్రాణంగా ఇష్టపడే వాళ్ళు మన తప్పు లేకుండా మననుండి విడిపోదామనుకుంటే ఆ బాదా,కష్టం మనసు లేని వారికైనా వస్తుంది.అ క్షణంలో ఏదోఒకటి చేసుకోవాలి అనిపిస్తుంది. మరి భరించలేనపుడు చచ్చిపోవాలి అనిపిస్తుంది.కాని అ సమయంలో కూడా పిచ్చిమనసు అవతలి వారి గురించే ఆలోచిస్తుంది.విడిపోవడం బాహ్యంగానే అయిన వారి ఙ్నపకాలు ఎప్పటికి తీపిగురుతులుగానే మిగిలిపొతాయి. కాని మళ్ళి భవిష్యత్తులో దేనినైన పొగొట్టుకునేటప్పుడు మాత్రం బాదా అనేది చాలా భయంకరంగా ఉన్న ఆ బాదాను చుపే కన్నిళ్ళు మాత్రం కడుపులొనే ఉండిపొతాయి.
ఎందుకంటే చుట్టూ ఉన్న పరిస్తితులు అలాంటివి.పరిస్తితులు పాముల్లా మన చుట్టూ ఉండి సూటి,పోటి మాటలాతో కాటెస్తాయెమో అనే భయం.అందుకే "కన్నీళ్ళను కూడా కలల్లా ఆ సమయంలో కరిగిపోమంటుంది మనసు". నిజమే! కాని జరిగిన తప్పులు ఎన్నైన,జతను వీడిన మనుషులు ఎవరైనా అది మన మంచికే అనుకుంటే అది కొంతకాలం తరువాత మానడానికి అవకాశం ఉంటుంది.కాని కొన్ని విషయాలు ఎంత మరచిపోదామన్న మరపురాదు. ఎందుకంటే గతం మన నీడవంటిది.ఏదుటివారితొ ఏమ్మాట్లాడుతున్న, ఏంత సంతోషం నటించినా అవతలి వ్యక్తి మనపై ప్రేమ చుపించినపుడుడల్లా గుర్తుకు వస్తుంది గతంలో చేజారిన క్షణలు,మరపురాని ఙ్నపకాలు.
బహుసా ఇదేనేమో జివితం అంటే...
పువ్వుల్లో తేనే దాగుందామన్నా తుమ్మేదకు ఎక్కడ ఉందో తెలియకుండా ఉండదుగా,
నీళ్ళల్లో మీనం దాగుందామన్నా జాలరికి ఎలా పట్టూకోవాలో తెలియకుండా ఉండదుగా,
మేఘల్లో చినుకులు దాగుందామన్నా గాలికి దానిని ఎలా బయటకు తేవాలో తెలియకుండా ఉండదుగా,
అలనే మనిషి పోగొట్టుకున్న క్షణలు దాచుకుందామనుకున్నా అంతరాత్మకు ఎలా గుర్తు చేయ్యాలొ తెలియకుండా ఉండదుగా.
మనసులో ఎముందో కనుక్కొవడానికి ఏమందులు ఉండావేమోగాని,మనసాక్షికి తెలుసుస్తుందిగా...చేసిన నేరాలు,మొసపోయిన క్షణలు,చేజారిన బందాలు.ఓరున కురిసే వానలో ఉప్పెన ఉందోలేదో,ఎదురువచ్చే శకునంలో మంచి ఉందోలేదో,ఆగిపోని కాలంలో వేగం ఉందోలేదో,తెలుసుకోలెము, వాటికి తెలియదు.ఎందుకంటే వాటికి జీవం,జీవితం రెండు లేవు.కాని మనిషి ఆలోచనలో అంతరంగం అనేది ఆ మనిషి అంతరాత్మకు కచ్చితంగా తెలుస్తుంది.చేసింది తప్పో, ఓప్పొ తేలుసుకొలేని వాడైతే తను మనిషే కాదు.కాని తెలుసుకొని పశ్చాతాపం కొరేవారైతే ఖచ్చితంగా అసమయంలో ఎంత సమర్ధించుకున్నా కళ్ళలో నీళ్ళు వద్దన్నా బయటకు వస్తాయి.అపరిస్తితులలో ఇంక "కడుపులో కన్నీళ్ళు ఎందుకు దాచుకొవడం" అనిపిస్తుంది.
నిజమే కదా...!! మనుషుల మద్య దూరం పెరగడానికి చాలా కారణాలు ఉండొచ్చు."ధనం, ఈర్ష, అత్యశ, గౌరవం, పనిలో వత్తిడ్లు, ఆకర్షణ, మనస్పర్ధలు, ఆలోచనలు, బందాలు, బంధుత్వాలు, అవగాహన లోపం, భయం, భద్యత, తొందరపాటు, భక్తి, ఫలితాలు, అభిరుచులు , అలవాట్లు, కొరికలు, అలకలు, దాపరికాలు, స్నేహం, ప్రేమ, పెళ్ళి, సంబందాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆనంతం....."కాని కొన్నింటిని నివారించలేము, కొన్నింటిని తప్పించగలము.
కొంతమంది ఒత్తిల్లకులోనైతే,కొంతమంది పరిస్తితులు ప్రభవితం చేస్తాయి.కొంతమంది ఇంట్లో సమస్యలుయేదురైతే, కొంతమంది వ్యక్తిత్వాలు అడ్డుగా నిలుస్తాయి.సమస్య ఎదైనాకాని,
అన్నింటికి కారణం ఒక్కటే "మనసుల మద్య కుదరని అభిప్రాయం",
అన్నింటికి సమదానం ఒక్కటే "పరస్పర అవగాహన శక్తి".
ఇది ఉంటే ఇక "కడుపులో కన్నీళ్ళను ఎందుకు దాచుకోవడం...? ","ఆనంద భాష్పాలు తప్ప...".
జీవితం మచ్చలేని నిప్పు వంటిది. దానిని చేతులు పెట్టి సవ్యంగా వేలిగించుకున్న మనమే, గాలికి వదిలేసి చేజార్చుకున్నా మనమే. పొయిన వాటి గురించి ఆలోచించవద్దు అనడంలేదు. కాని వచ్చే వాటిని చేజారిపొనివ్వద్దు అంటున్నాను...!
ఆలోచించండి మీ జీవితాన్ని చక్కదిద్దుకొండి.
పల్లవి || నా ప్రాణమా నను వీడిపోకుమా... నీ ప్రేమలో నను కరగనీకుమా పదేపదే నా మనసే నిన్నే కలవరిస్తుంది వద్దనా వినకుండా నిన్నే కోరుకుంటుంది అనిత.. అనితా.. అనిత ఓ వనిత.... నా అందమైన అనిత.. దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన ||నా ప్రాణమా|| చరణం|| ఓ ఓ ఓహ్.. ఓ ఓ ఓహ్.. నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా, నీ ప్రేమ అనే పంజరాన చికుకొని పడి ఉన్నా, కలల కూడా నీ రూపం నను కలవరపరిచేనే , కనుపాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెనే , నువ్వొకచోటా నేనోకచోటా, నిను చూడకుండానే క్షణముండలేనుగా , నా పాటకి ప్రాణం నీవే, నా రేపటి స్వప్నం నీవే , నా ఆశల రాణివి నీవే, నా గుండెకి గాయం చేయకే..ఎహ్.. అనిత.. అనితా ఆ అనిత ఓ వనిత నా అందమైన అనిత.. దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన ||నా ప్రాణమా|| చరణం|| నువ్వే నా దేవతవని ఎదలో కొలువుంచ, ప్రతి క్షణము ధ్యానిస్తు పసిపాపల చూస్తా, విసుగు రాని నా హృదయం నీ పిలుపుకు ఎదురు చూసేను, నిన్ను పొందని ఈ జన్మే నాకెందుకేఅని అంటుందే, కరునిస్తావో.. కాటేస్తావో.. నువ్వు కాదని అంటే, నే శిలను అవతానే.. నను వీడని నీడవు నీవే, ప్రతి జన్మకు తోడువు నీవే, నా కమ్మని కలలు కూల్చి నన్ను ఒంటరివాన్ని చేయకే.. ఎహ్.. అనిత.. అనితా.. ఆ అనిత ఓ వనిత నా అందమైన అనిత.. దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన ||నా ప్రాణమా|| చరణం|| ఏదో రోజు నాపై నీ.. ప్రేమ కల్గుతుందని ఒక్క చిన్ని ఆశ నాలో సచ్చే అంత ప్రేమ మదిలో, ఎవరు ఏమనుకున్నా, కాలమే కాదన్న ||2|| ఒట్టేసి చెబుతున్నా నా ఊపిరి ఆగువరకు, నిను ప్రేమిస్తూనే ఉంటా.. అనిత.. అనిత.. అనితా.. ఆ అనిత ఓ వనిత నా అందమైన అనిత.. దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన ||నా ప్రాణమా||
Subscribe to:
Comments (Atom)