పల్లవి || నా ప్రాణమా నను వీడిపోకుమా... నీ ప్రేమలో నను కరగనీకుమా పదేపదే నా మనసే నిన్నే కలవరిస్తుంది వద్దనా వినకుండా నిన్నే కోరుకుంటుంది అనిత.. అనితా.. అనిత ఓ వనిత.... నా అందమైన అనిత.. దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన ||నా ప్రాణమా|| చరణం|| ఓ ఓ ఓహ్.. ఓ ఓ ఓహ్.. నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా, నీ ప్రేమ అనే పంజరాన చికుకొని పడి ఉన్నా, కలల కూడా నీ రూపం నను కలవరపరిచేనే , కనుపాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెనే , నువ్వొకచోటా నేనోకచోటా, నిను చూడకుండానే క్షణముండలేనుగా , నా పాటకి ప్రాణం నీవే, నా రేపటి స్వప్నం నీవే , నా ఆశల రాణివి నీవే, నా గుండెకి గాయం చేయకే..ఎహ్.. అనిత.. అనితా ఆ అనిత ఓ వనిత నా అందమైన అనిత.. దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన ||నా ప్రాణమా|| చరణం|| నువ్వే నా దేవతవని ఎదలో కొలువుంచ, ప్రతి క్షణము ధ్యానిస్తు పసిపాపల చూస్తా, విసుగు రాని నా హృదయం నీ పిలుపుకు ఎదురు చూసేను, నిన్ను పొందని ఈ జన్మే నాకెందుకేఅని అంటుందే, కరునిస్తావో.. కాటేస్తావో.. నువ్వు కాదని అంటే, నే శిలను అవతానే.. నను వీడని నీడవు నీవే, ప్రతి జన్మకు తోడువు నీవే, నా కమ్మని కలలు కూల్చి నన్ను ఒంటరివాన్ని చేయకే.. ఎహ్.. అనిత.. అనితా.. ఆ అనిత ఓ వనిత నా అందమైన అనిత.. దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన ||నా ప్రాణమా|| చరణం|| ఏదో రోజు నాపై నీ.. ప్రేమ కల్గుతుందని ఒక్క చిన్ని ఆశ నాలో సచ్చే అంత ప్రేమ మదిలో, ఎవరు ఏమనుకున్నా, కాలమే కాదన్న ||2|| ఒట్టేసి చెబుతున్నా నా ఊపిరి ఆగువరకు, నిను ప్రేమిస్తూనే ఉంటా.. అనిత.. అనిత.. అనితా.. ఆ అనిత ఓ వనిత నా అందమైన అనిత.. దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన ||నా ప్రాణమా||

అమ్మ అంటే చులకన భావం ఎందుకని?

నా ఈ బావుద్వేగం ఎవరిని వుద్దెసించినది కాదు.
కాని ప్రతి నిత్యం జరుగుతున్న నమ్మలెని నిజాలు.
ఈ సృష్టికి ప్రాణం పోసేది అమ్మ, ఈ లోకానికి జీవనమిచ్చేది అమ్మ.
మనకీ ఉపిరి పోసి,జీవం ఇచ్చి, జీవితాన్ని ఇచ్చే అమ్మ అంటే ఎంతమంది కి ఈ లోకంలో నిజంగ ప్రేమ ఉంది.
నేటి యువత తమ ప్రేమను,మూడు నెలల క్రితం వచ్చిన వాళ్ళపైన చూపించినట్టుగా. చిన్నపటి నుండి ఏంటో శ్రమతో అల్లారుముద్దుగా పెంచిన తల్లి పైన ఎందుకు చూపలేకపోతున్నరు.
రోజూ పొద్దున్న లేవగానే ఫోన్ తీసి మరి తన ప్రేయసికి, ప్రేమికుడికి, ఉపాధ్యాయులకు, తెలిసిన వాళ్ళకి, తెలియనివాళ్ళకి, "GOOD MORNING" చెప్పేవారు.
తనని, తన తప్పుల్ని క్షమించి తన కడుపులోనే దాచుకునే తల్లికి ఎందుకని చెప్పలేరు.
ఈ ప్రశ్నకి జావాబు ఏవరైనా, ఏప్పుడైనా ఆలోచించారా.మాతృమూర్తి గురించి ఎంత చెప్పిన తక్కువేగ.
మరి ఎందుకు ప్రేమికుల రోజంటే నెల, రెండు నెలల నుండి ఎప్పుడు ,వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చూసే నేటి యువత మరి ఎందుకని "MOTHERS DAY" అంటే చులకన బావం.
అమ్మకి ఒక మనసుంటుంది తానూ కుడా ఒక మనిషె అని ఎంతమందికి ఆలోచిస్తూన్నారు.
తనకి కూడ బాదా, సంతొషం ఇలా అన్ని ఉంటాయని ఎందుకు అర్ధం చేసుకోరూ.
రోజూ పెపర్లొ,టివిలొ అడపడుచులపై, మాత్రుమూర్తులపై జరిగె ఆరాచకాలు, మోసాలు పెరిగిపొతుంటె ఇంకొన్ని రొజులలొ ఈ ప్రపంచమె అంతరిస్తుందా అనే భయం కలుగక మానదు.
దేవుడు అన్ని దిక్కులా ఉండలేడు కాబట్టి అమ్మను సృష్టించాడు అంటారు.మరి ఆ అమ్మకు ఎంతవరకు మనం ఆరాదిస్తున్నం.

ఆలోచించండి, అమ్మను కుడా దైవంగా ఆరదించండి.

క్షమించండి,
ఈది నాలొ ఎప్పటినుండొ వున్న అత్మసంగర్షణ.
దీనికి సమదానం ఆలోచించండి. మీ అభిప్రాయాలను తప్పకుండా పంపించండి.

About Me

My Name is Durgesh Iam belongs to Warangal Dist.Now Iam studying Rgukt-IIIT-Basar. I'm a sensitive and cool..