పల్లవి || నా ప్రాణమా నను వీడిపోకుమా... నీ ప్రేమలో నను కరగనీకుమా పదేపదే నా మనసే నిన్నే కలవరిస్తుంది వద్దనా వినకుండా నిన్నే కోరుకుంటుంది అనిత.. అనితా.. అనిత ఓ వనిత.... నా అందమైన అనిత.. దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన ||నా ప్రాణమా|| చరణం|| ఓ ఓ ఓహ్.. ఓ ఓ ఓహ్.. నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా, నీ ప్రేమ అనే పంజరాన చికుకొని పడి ఉన్నా, కలల కూడా నీ రూపం నను కలవరపరిచేనే , కనుపాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెనే , నువ్వొకచోటా నేనోకచోటా, నిను చూడకుండానే క్షణముండలేనుగా , నా పాటకి ప్రాణం నీవే, నా రేపటి స్వప్నం నీవే , నా ఆశల రాణివి నీవే, నా గుండెకి గాయం చేయకే..ఎహ్.. అనిత.. అనితా ఆ అనిత ఓ వనిత నా అందమైన అనిత.. దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన ||నా ప్రాణమా|| చరణం|| నువ్వే నా దేవతవని ఎదలో కొలువుంచ, ప్రతి క్షణము ధ్యానిస్తు పసిపాపల చూస్తా, విసుగు రాని నా హృదయం నీ పిలుపుకు ఎదురు చూసేను, నిన్ను పొందని ఈ జన్మే నాకెందుకేఅని అంటుందే, కరునిస్తావో.. కాటేస్తావో.. నువ్వు కాదని అంటే, నే శిలను అవతానే.. నను వీడని నీడవు నీవే, ప్రతి జన్మకు తోడువు నీవే, నా కమ్మని కలలు కూల్చి నన్ను ఒంటరివాన్ని చేయకే.. ఎహ్.. అనిత.. అనితా.. ఆ అనిత ఓ వనిత నా అందమైన అనిత.. దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన ||నా ప్రాణమా|| చరణం|| ఏదో రోజు నాపై నీ.. ప్రేమ కల్గుతుందని ఒక్క చిన్ని ఆశ నాలో సచ్చే అంత ప్రేమ మదిలో, ఎవరు ఏమనుకున్నా, కాలమే కాదన్న ||2|| ఒట్టేసి చెబుతున్నా నా ఊపిరి ఆగువరకు, నిను ప్రేమిస్తూనే ఉంటా.. అనిత.. అనిత.. అనితా.. ఆ అనిత ఓ వనిత నా అందమైన అనిత.. దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన ||నా ప్రాణమా||

దరి చేరుకో నేస్తం.....

మనసులోని మాట బయటకు వచ్చేనమ్మా!తేనేలోలుకు పాట సెదతీరెనమ్మ!!

ఏందుకో తెలియని తనతో మది ఉగిసలాడుతుంది.అడగరానిది కోరుతు యద భారమవుతుంది.

కనులకు తెలియని కలలతో నిద్ర చంపుతుంది. ఆశ ఎరుగని తనువు ఆత్రంతో ఎదురుచూస్తుంది.. అందరాని ద్యాశతో అడుగుతున్నా... పొందరాని ఉహతో పొంచిచూస్తున్నా....

కలలా అలలతో నన్ను తదుపుమా,నాకు కన్నీల్లు మిగల్చకుమా!

మంచు కడలిలో నన్ను చూడుమా నాలో భ్రమలా మిగలకుమా!!

మెరుపు వెలుగువై నన్ను తాకుమా,నాలో ఆరని జ్వాలను రేపకుమా!

వెన్నెల రాత్రి నన్ను చేరుమా, నాలో చికటి ఇక పెంచకుమా!!

నిన్ను ప్రేమిస్తా నా గుండెగా, నిన్ను పుజిస్తా నా ప్రాణంగా, నిన్ను నవ్విస్తా నా మాటగా, నిన్ను లాలిస్తా పసి పాపగా, నువ్వు నన్ను చూసేదాక వేచుంటా ఎన్నాళైనా, నువ్వు నన్ను చేరేదాక ఆగివుంటా ఎన్నేళైనా,

చివరిగా,

కరుణించి అందుకో నా స్నేహం! దయచేసి నువ్వు చెరపాలి ఈదూరం!!

About Me

My Name is Durgesh Iam belongs to Warangal Dist.Now Iam studying Rgukt-IIIT-Basar. I'm a sensitive and cool..